కరోనా భయం వెంటాడినా సాహసించారు..!

తాజా వార్తలు

Updated : 08/08/2020 15:39 IST

కరోనా భయం వెంటాడినా సాహసించారు..!

కేరళ సీఎం విజయన్‌ ప్రశంస

కొలికోడ్‌: కేరళలోని కోలికోడ్‌ విమాన ప్రమాద ఘటనలో క్షతగాత్రులను గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌ పరామర్శించారు. వారిద్దరూ కొలికోడ్‌ వైద్య కళాశాలను సందర్శించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసిన సీఎం విజయన్‌.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ప్రతిస్పందించిన తీరును ట్విటర్‌లో ప్రశంసించారు. భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోయినా.. కరోనా భయం వెంటాడుతున్నా తోటి మనుషులను కాపాడుకోవాలనే సంకల్పంతో సాహసోపేతంగా వ్యవహరించారని కొనియాడారు. విమాన ప్రమాదంలో బాధితులకు రక్తదానం చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడం దీనికి మరో ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.  ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటితో పోరాడటం కేరళ ప్రజలకు కొత్తేం కాదన్నారు. ఇదివరకే చాలాసార్లు చూశామని తెలిపారు. మానత్వం, మంచితనం తమ సమాజంలో అడుగడుగునా ఉందన్నారు. ఈ సందర్భంగా మలప్పురం, కొలికోడ్‌ జిల్లాల ప్రజలను అభినందించారు. 

22 మంది పరిస్థితి విషమం

కొలికోడ్‌లో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల్లో 149 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. వారిలో 22 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 22 మందికి చిన్నచిన్నగాయాలే కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు తరలించారు. 

వారందరికీ కొవిడ్‌ పరీక్షలు

విమానాశ్రయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని  వైద్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. మరోవైపు, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 30 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని