పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే

తాజా వార్తలు

Published : 25/10/2020 02:21 IST

పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే

అమరావతి: పోలవరం ప్రాజెక్టు రెండో డీపీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా రాష్ట్రం పంపిన అంచనాలు, కేంద్రం ఇస్తామన్న నిధులపై  సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు. 2014 అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లే ఇస్తామని దీనికి అంగీకరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. దీనిపై సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. రూ.55,448.87 కోట్లతో రూపొందించిన రెండో డీపీఆర్‌కు ఆథారిటీ, కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపాయి. దీనిలో 47,725.74 కోట్లకు రివైజ్డ్‌‌ కాస్ట్‌ కమిటీ, కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం ఉంది. రెండో డీపీఆర్‌ ఆమోదించాలని ఆర్థికశాఖను జల్‌శక్తి శాఖ కోరిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.29వేల కోట్లు కావాలని సీఎంను అధికారులు కోరారు. 2014 అంచనా ప్రకారం 20,398.61 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రంపైనే ఉందని జగన్ అన్నారు‌. విభజన చట్టం, కేంద్ర కేబినెట్‌ నిర్ణయం దాన్నే అంగీకరిస్తుందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు మాత్రమే చూస్తోందని, ప్రాజెక్టు పర్యవేక్షణ అంతా పీపీఏ చూస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని, సీడబ్ల్యూసీ, రివైజ్డ్‌‌ కాస్ట్‌ కమిటీ ఆమోదించిన అంచనాల అమలుకు కృషి చేయాలని సీఎం జగన్ అధికారులను‌ ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని