close

తాజా వార్తలు

Published : 20/04/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

KCR Corona Positive: సీఎం కేసీఆర్‌కు కరోనా

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్‌‌ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్‌ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్‌కుమార్‌ చెప్పారు.‌ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. సీఎంకు విశ్రాంతి సూచించామన్నారు. 

‘‘గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యులు నిరంతరం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఎన్నో సందేశాలు వస్తున్నాయి. మీ ప్రార్థనలతో కేసీఆర్‌ త్వరలోనే కోలుకుంటారు’’ -ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ రావడం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విచారం వ్యక్తం చేశారు. సీఎం త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కూడా కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.




ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని