ఏపీలో కొత్తగా 9,276 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 01/08/2020 17:42 IST

ఏపీలో కొత్తగా 9,276 కరోనా కేసులు

బులిటెన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 1.50లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 నమూనాలను పరీక్షించగా కొత్తగా 9,276 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,407 మంది మృతి చెందారు. 

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 72,188 మంది చికిత్స పొందుతుండగా.. 76,614 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు బులిటెన్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇవాళ అత్యధికంగా 12,750 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కావడం విశేషం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,12,573 నమూనాలను ప్రభుత్వం పరీక్షించింది. తూర్పుగోదావరిలో 8మంది, విశాఖపట్నంలో 8,  గుంటూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని