ఇంటర్నెట్‌ వినియోగంపై జాగ్రత్త

తాజా వార్తలు

Published : 17/07/2020 01:37 IST

ఇంటర్నెట్‌ వినియోగంపై జాగ్రత్త


సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉన్నారన్న సజ్జనార్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలంలో పిల్లల అంతర్జాల వినియోగం పెరిగిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. దీనిపై ఆయన పలు సూచనలు చేశారు. ఇంటర్నెట్‌లో సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని చెప్పారు. పిల్లలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. సోషల్ మీడియాలో పిల్లలు యాక్టివ్‌గా ఉండకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి, బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశముందని, అందువల్ల చిన్నారులు చేస్తున్న పోస్టింగ్‌లపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. సాధ్యమైనంత వరకూ వారిని సోషల్ మీడియాకి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలని అన్నారు. తప్పనిసరైతే పెద్దల సమక్షంలో ఉపయోగించుకోనివ్వాలన్నారు. సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం వచ్చినా సైబర్‌ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని