పీపీపీ.. డుండుండుంలో పీపీఈ కిట్లు!

తాజా వార్తలు

Updated : 06/08/2020 13:08 IST

పీపీపీ.. డుండుండుంలో పీపీఈ కిట్లు!

ఇంటర్నెట్‌డెస్క్‌: పెళ్లిళ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఈ వేడుకల్లో కొత్త పంథాలకు తెరలేపడం చాలా రోజులుగా జరుగుతున్నదే. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు మరిన్ని వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుక ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన వారంతా ఇంకెన్ని మార్పులు చూస్తామో అని మాస్క్‌న వేలేసుకుంటున్నారు.

కృష్ణా జిల్లా ముదినేపల్లిలో ఓ కల్యాణ మండపలంలో ఇటీవల ఓ వివాహం జరిగింది. కరోనా కారణంగా నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో గుడివాడకు చెందిన క్యాటరింగ్‌ యజమాని వినూత్న ఆలోచన చేశారు. వడ్డించడానికి వచ్చిన వారికి పీపీఈ కిట్లు, ఫేస్‌ షీల్డులు అందజేశారు. భౌతిక దూరం పాటించేలా టేబుళ్లను కూడా దూరం దూరంగా ఉంచారు. మొదట విందుకు హాజరైన వారంతా ఈ బృందాన్ని చూసి వైద్యులేమోనని కంగారు పడ్డారు. అసలు విషయం తెలిశాక.. ‘కాసేపు కంగారు పెట్టారు కదటయ్యా’’ అంటూ నవ్వుతూ ఆ విందు ఆరగించి నూతన వధూవరులనను ఆశీర్వదించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని