ఏపీ సీఎస్‌తో కేంద్రబృందం భేటీ

తాజా వార్తలు

Published : 09/11/2020 15:43 IST

ఏపీ సీఎస్‌తో కేంద్రబృందం భేటీ

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. తొలుత సచివాలయంలో సీఎస్‌ నీలం సాహ్నితో కేంద్రబృందం సమావేశమైంది. ఈ సందర్భంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను బృందం పరిశీలించింది. అనంతరం పంటనష్టంపై రాష్ట్ర ఉన్నతాధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,386కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ.840కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 

వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ రంగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. వర్షాలకు భారీగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఆర్‌అండ్‌బీ శాఖు రూ.2,976 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించింది. ఇప్పటికే ఈ విషయంపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం జగన్‌ లేఖ రాసిన విషయాన్ని ఉన్నతాధికారులు కేంద్రబృందానికి తెలిపారు. సమావేశం అనంతరం కేంద్ర అధికారులు బృందాలుగా విడిపోయి జిల్లాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని