ఏలూరు ఘటనపై కేంద్రహోంశాఖ ఆరా

తాజా వార్తలు

Published : 07/12/2020 01:09 IST

ఏలూరు ఘటనపై కేంద్రహోంశాఖ ఆరా

దిల్లీ: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలో పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన సంఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ గవర్నర్‌ కార్యాలయంతో కేంద్రహోంశాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. గవర్నర్‌ నుంచి ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక వచ్చాక కేంద్రం స్పందించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..

ఏలూరు ఘటన: పెరుగుతున్న బాధితులు

ఏలూరు అస్వస్థత ఘటన.. వ్యక్తి మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని