ప్రపంచం మన టీకావైపే చూస్తోంది:కిషన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 27/12/2020 04:26 IST

ప్రపంచం మన టీకావైపే చూస్తోంది:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఇప్పటివరకు కరోనా టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సరైన టీకా ఎంపిక విషయంలో టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటైందని వెల్లడించారు. నగరంలోని ల్యాబ్‌క్యూబ్‌లో ఇమ్యూనో బూస్టర్‌ ఉత్పత్తిని కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీరం, భారత్‌ బయోటెక్‌ టీకాల కోసం ప్రపంచం వేచిచూస్తోందన్నారు. ఫైజర్‌, స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ కంటే భారత టీకాలపైనే ప్రపంచానికి ఆసక్తిగా ఉందన్నారు. ట్రయల్స్‌లో ఉన్న భారతదేశ టీకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని