అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 13/08/2020 21:14 IST

అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

అమరావతి: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా సోకడంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. అచ్చెన్నకు కరోనా సోకిందని తెలిసి బాధపడుతున్నానన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. కరోనా నుంచి అచ్చెన్నాయుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు. 

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నను పోలీసులు అరెస్టుచేశారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని