సివిల్స్‌-2019 ఫలితాలు విడుదల
close

తాజా వార్తలు

Updated : 04/08/2020 19:26 IST

సివిల్స్‌-2019 ఫలితాలు విడుదల

దిల్లీ: సివిల్‌ సర్వీస్‌ పరీక్ష-2019 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 829 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్ మొదటి స్థానం సాధించాడు. జతిన్‌ కిషోర్‌, ప్రతిభా వర్మ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

ఎంపికైన వారిలో 304మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారేనని యూపీఎస్సీ వెల్లడించింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ కోటాలో 78 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓబీసీ 251, ఎస్సీ 129, ఎస్టీ కేటగిరీలో 67 మంది ఉద్యోగాలు సాధించారు. మొత్తం 927 ఖాళీలకు గానూ పరీక్షలు నిర్వహించారు. మరో 182 మంది ఫలితాలను రిజర్వ్‌లో ఉంచినట్లు యూపీఎస్సీ తెలిపింది. మరో 15 రోజుల్లో మార్కులు జాబితాను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది.

తెలుగువారి సత్తా

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంచి ర్యాంకులను సాధించి తమ సత్తా చాటారు. పెద్దిటి ధాత్రిరెడ్డి 46వ ర్యాంకు,  మల్లవరపు సూర్య తేజకు 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, ఎంవీ సత్యసాయి కార్తీక్‌ 103,  తాటిమాకుల రాహుల్‌ రెడ్డి 117, కె. ప్రేమ్‌ సాగర్‌ 170,  శ్రీ చైతన్య కుమార్‌ రెడ్డి 250, చీమల శివగోపాల్ రెడ్డి 263, నారాయణపేటకు చెందిన బి. రాహుల్‌కు 272వ ర్యాంకు, మోహన్‌ కృష్ణ 283,  ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి 314వ ర్యాంకు, ముత్తినేని సాయితేదజ 344, ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి 427వ ర్యాంకు, కొల్లాబత్తుల కార్తీక్‌ 428, ఎన్‌ వివేక్‌ రెడ్డి 485, కొరుపోలు సత్యధర్మ ప్రతాప్‌(510), నీతిపూడి రష్మితారావు 534, కోరుకొండ సిద్ధార్థ 566, సమీర్‌ రాజా 603, కొప్పిశెట్టి కిరణ్మయి 633వ ర్యాంక్‌ సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని