హాస్యనటి దంపతులకు బెయిల్‌ మంజూరు

తాజా వార్తలు

Published : 23/11/2020 16:50 IST

హాస్యనటి దంపతులకు బెయిల్‌ మంజూరు

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన భారతిసింగ్‌ దంపతులకు ఊరట

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన హిందీ హాస్యనటి భారతిసింగ్‌, హర్ష్‌ లింబాచియ్యా దంపతులకు ముంబయిలోని మెట్రోపాలిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించాలని ఆదివారం కోర్టు ఆదేశించిన అనంతరం దంపతుల తరఫు న్యాయవాది ఆయాజ్‌ ఖాన్‌బెయిల్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. సోమవారం వారి బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు భార్యాభర్తలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని వారి న్యాయవాది వెల్లడించారు. ఒక్కొక్కరికీ రూ.15 వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వారి విడుదలపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇంకా స్పందించలేదు.

నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్‌ మృతితో బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వినియోగం కలకలం రేపింది. ఎన్‌సీబీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. మరికొంతమందిని విచారించింది. అరెస్టయిన ఓ వ్యక్తి సమాచారం మేరకు ఎన్‌సీబీ అధికారులు శనివారం ఉదయం భారతిసింగ్‌, హర్ష్‌ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా వారింట్లో 86.5 గ్రాముల గంజాయి లభించడంతో దర్యాప్తు సంస్థ భార్యాభర్తలకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరవ్వగా సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం డ్రగ్స్‌ తీసుకున్నట్లు బారతిసింగ్‌తోపాటు హర్ష్‌ లింబాచియ్యా ఒప్పుకున్నారు. దీంతో వారిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం భార్యాభర్తలను ముంబయి కోర్టు ముందు హాజరుపరచగా వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అనంతరం వారి తరఫు న్యాయవాది బెయిల్‌కు దరఖాస్తు చేయగా ప్రత్యక న్యాయస్థానం సోమవారం వారిని బెయిల్‌పై విడుదల చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని