ఏపీలో కరోనా ఉద్ధృతి: మరో 7200 కేసులు

తాజా వార్తలు

Updated : 26/09/2020 18:29 IST

ఏపీలో కరోనా ఉద్ధృతి: మరో 7200 కేసులు

అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తి రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే తాజాగా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 75,990 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7293 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా మరో 57మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తంగా 55,23,786 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,68,751 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 5663 మంది మృత్యువాత పడగా.. 5,97,294మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 65,794 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1011 కేసులు నమోదు కాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 922 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అలాగే, చిత్తూరులో 975, ప్రకాశం 620, కడప 537, అనంతపురం 513 చొప్పున అత్యధిక కేసులు నమోదయ్యాయి.  

కొత్తగా నమోదైన మరణాలు ఇలా..

శనివారం కొత్తగా ప్రకాశం జిల్లాలో పది మంది మృత్యువాతపడగా..  చిత్తూరు, కడప జిల్లాల్లో ఎనిమిది చొప్పున, కృష్ణాలో ఆరుగురు, విశాఖలో ఐదుగురు, ఉభయ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లా్ల్లో ముగ్గురేసి, అనంతపురం,శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూలు, విజయనగరం జిల్లా్ల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా కరోనా పరిస్థితి పరిశీలిస్తే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని