కరోనా మృతదేహాన్ని తాళ్లతో లాక్కెళ్లి..

తాజా వార్తలు

Published : 02/08/2020 01:04 IST

కరోనా మృతదేహాన్ని తాళ్లతో లాక్కెళ్లి..

అమానవీయకరంగా అంత్యక్రియలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరణించిన వారికి సంప్రదాయబద్ధంగా, సకల మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటాం. కానీ కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలు కుటుంబసభ్యుల చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నాయి. అంత్యక్రియలు సైతం వైద్య సిబ్బందే నిర్వహిస్తున్నారు.  అయితే కొన్ని చోట్ల మృతదేహాలను అగౌరపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కర్ణాటకలోకి బెళగావి జిల్లా గొకాక తాలూకాకు చెందిన 92 ఏళ్ల ఓ వృద్దుడు కరోనాతో మృతిచెందగా అతడి మృతదేహాన్ని వైద్య సిబ్బంది అమానవీయంగా తాళ్లతో లాక్కెళ్లి అంత్యక్రియలు చేశారు. కాగా ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమయ్యాయి. దీంతో నెటిజన్లు, మృతుడి కుటుంబసభ్యులు వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని