టాక్సీలో బాలుడిని మర్చిపోయిన తల్లిదండ్రులు 

తాజా వార్తలు

Published : 29/10/2020 15:57 IST

టాక్సీలో బాలుడిని మర్చిపోయిన తల్లిదండ్రులు 

కోల్‌కతా: టాక్సీలు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించినప్పుడు సాధారణంగా తాళాలు.. మొబైల్స్‌.. బ్యాగులు తదితర వస్తువులను మర్చిపోతాం. కొద్దిసేపటికి ఆ వస్తువుల గురించి గుర్తు రాగానే, కంగారుపడతాం. వీలైతే వాటిని ఎలా తిరిగి తెచ్చుకోవాలో ప్రయత్నిస్తాం. అయితే కోల్‌కతా విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఓ కుటుంబం టాక్సీలో ఆరేళ్ల బాలుడిని మరిచిపోయి వెళ్లిన ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. లఖ్‌నవూ చేరుకోవడానికి ఓ కుటుంబం కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. కారులో నుంచి లగేజీ దించటం, విమానం బయలుదేరే సమయం దగ్గరపడటంతో తల్లిదండ్రులు కారులో నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని మరిచిపోయారు. లగేజీతో పాటు విమానంలో లఖ్‌నవూకు వెళ్లడంతో పాటు వాళ్లతో ఆరేళ్ల చిన్నారి లేడని గుర్తించకుండా ఇంటికి సైతం చేరుకున్నారు. తీరా ఇంటికి వచ్చాక బాలుడు ఏమయ్యాడోనని ఆరా తీయగా టాక్సీ వెనుక సీటులో అలాగే వదిలేసి వచ్చినట్లు గుర్తొచ్చింది.

టాక్సీ బిల్లుపై ఉన్న ఫోన్‌ నెంబరు ఆధారంగా వాళ్లు వెంటనే కోల్‌కతాలోని ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించారు. తమ కొడుకుని టాక్సీలో మర్చిపోయి ఇంటికి వచ్చినట్లు చెప్పిన తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలని కోరారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు విమానాశ్రయ అధికారులను సంప్రదించి అక్కడ నమోదైన టాక్సీ నెంబర్‌ ఆధారంగా డ్రైవరుతో ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. కారు వెనుక సీటులో చిన్నారి నిద్రిస్తున్నాడేమో చూడమని పోలీసులు చెప్పగా అప్పటికీ ఆ బాలుడు నిద్రలోనే ఉండటం చూసి డ్రైవరు ఆశ్చర్యపోయాడు. తన 14 ఏళ్ల డ్రైవర్‌ వృత్తిలో ఇలా పిల్లాడిని వదిలి వెళ్లిన దంపతులను చూడలేదని అతను పేర్కొన్నాడు. అనంతరం ఆ డ్రైవరు బాలుడిని విమానాశ్రయ అధికారుల వద్దకు చేర్చారు. చిన్నారి తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు బాలుడిని వారికి అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని