శాంతి భద్రతలకు తెలంగాణ నిలయం: డీజీపీ

తాజా వార్తలు

Published : 19/07/2020 01:20 IST

శాంతి భద్రతలకు తెలంగాణ నిలయం: డీజీపీ

హైదరాబాద్‌: శాంతిభద్రతలకు నిలయంగా తెలంగాణ ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం సంతోషంగా ఉందని తెలిపారు.ఇటీవల కాలంలో మవోయిస్టుల అలజడి రేగుతున్న నేపథ్యంలో  భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాల పోలీసు అధికారులతో తీవ్రవాద నిరోధక చర్యలపై డీజీపీ సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇక్కడి నుంచి గతంలో ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన మావోలు మళ్లీ రావాలని ప్రయత్నిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో అమాయక గిరిజనులను ప్రోత్సహించి నేరాలు చేయిస్తున్నారు. మావోయిస్టులు ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. మోసపూరితంగా గిరిజనుల విశ్వాసం పొందేందుకు యత్నిస్తున్నారు. ఎంతో మందికి లేఖలు రాసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. గుత్తేదారులు, వ్యాపారులు, వైద్యుల నుంచి డబ్బులు వసూలు చేశారు’’ అని అన్నారు. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ దాటి రాకుండా  కృతనిశ్చయంతో పని చేస్తామని, ప్రజల్లో అలజడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని