Chhota Rajan: చనిపోలేదు: దిల్లీ పోలీస్‌
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chhota Rajan: చనిపోలేదు: దిల్లీ పోలీస్‌

దిల్లీ: ఒకప్పటి అండర్‌వరల్డ్‌ డాన్‌గా పేరొందిన ఛోటా రాజన్‌(62) కొవిడ్‌తో మృతిచెందాడంటూ వస్తున్న వార్తలను దిల్లీ పోలీసులు ఖండించారు. తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఛోటా రాజన్‌కు గతనెల 27న వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను తిహాడ్‌ జైలు అధికారులు ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొవిడ్‌ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఛోటా రాజన్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం కన్నుమూసినట్లు ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారంటూ వార్తలు ప్రసారమయ్యాయి. ఈ వార్తలను ఎయిమ్స్‌ వర్గాలు, దిల్లీ పోలీసులు ఖండించారు.

గ్యాంగ్‌స్టర్‌గా పేరొందిన ఛోటా రాజన్‌ అసలు పేరు రాజేంద్ర నికల్జీ. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్న ఛోటారాజన్‌ను 2015లో ఇండోనేషియా నుంచి తీసుకువచ్చిన భారత అధికారులు.. కట్టుదిట్టమైన భద్రత మధ్య తిహాడ్‌ జైలులో ఉంచారు. ఆ సమయంలో జైలు అధికారులు నిర్వహించిన పరీక్షల్లో అతనికి కొవిడ్‌ వైరస్‌ నిర్ధారణ అయ్యింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని