ప్లాస్మాదానం చేసిన మొదటి కేంద్ర మంత్రి ఆయనే!

తాజా వార్తలు

Updated : 04/10/2020 01:41 IST

ప్లాస్మాదానం చేసిన మొదటి కేంద్ర మంత్రి ఆయనే!

దిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం ప్లాస్మా దానం చేశారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన ప్లాస్మా దానం చేసిన మొదటి కేంద్రమంత్రిగా నిలిచారు. మహమ్మారిని జయించిన ప్రజలు కూడా ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేయడం తనకు చాలా సంతృప్తి కలిగించిందన్నారు. మహమ్మారిని జయించిన తరువాత ప్లాస్మా దానం చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కరోనా సోకిన తరువాత దాని నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో కొవిడ్‌ -19కు సంబంధించిన యాంటీబాడీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ యాంటీబాడీలు ఉన్న ప్లాస్మాను ఇవ్వటం వల్ల కొవిడ్‌తో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని