లారీని ఆపి చెరకు ఆరగించిన ఏనుగులు!

తాజా వార్తలు

Published : 01/10/2020 01:12 IST

లారీని ఆపి చెరకు ఆరగించిన ఏనుగులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలోని బెంగళూరు-దిండుగల్ జాతీయ రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న ఓ లారీని ఏనుగులు ఆపిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. లారీని రోడ్డుపై అడ్డంగా ఆపిన ఏనుగులు అందులోని చెరకును లాగేసుకొని కావాల్సినంత ఆరగించాయి. పిల్ల ఏనుగులకు కొన్ని చెరకు గడలు అందించిన పెద్ద ఏనుగులు.. తామూ పుష్టిగా తిన్నాయి. అరగంట అనంతరం అక్కడి నుంచి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నింటినీ మొబైల్ ఫోన్‌లో వీడియో తీసిన లారీ డ్రైవర్‌ సామాజిక మాధ్యమాల్లో ఉంచగా వాటిని చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. కింద లింకులో ఉన్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని