మాస్కు వద్దన్న చిన్నారి.. విమానం దింపిన సిబ్బంది!

తాజా వార్తలు

Published : 15/12/2020 01:59 IST

మాస్కు వద్దన్న చిన్నారి.. విమానం దింపిన సిబ్బంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ వచ్చాక ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరైన విషయం తెలిసిందే. విమానయాన సంస్థలు సైతం ప్రయాణికులు మాస్క్‌ తప్పనిసరి అనే నిబంధనను పెట్టాయి. ఈ క్రమంలో న్యూజెర్సీకి చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేందుకు వచ్చిన ఓ కుటుంబానికి మాస్కు విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తమ రెండేళ్ల చిన్నారి మాస్క్‌ ధరించేందుకు మారాం చేయడంతో సిబ్బంది తల్లిదండ్రులతో పాటు ఆ చిన్నారిని విమానం నుంచి దింపేశారు. 

వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నెవాక్‌ విమానాశ్రయంలో డెన్వర్‌ నుంచి న్యూజెర్సీకి బయలుదేరేందుకు సిద్ధమైంది. అందులో ఓ జంట తమ రెండేళ్ల కుమార్తెతో కలిసి విమానం ఎక్కారు. వారి కుమార్తె మాస్కు పెట్టుకోకపోవడం సిబ్బంది గమనించి తల్లిదండ్రులకు సూచించారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తెకు మాస్కు పెట్టేందుకు ప్రయత్నించగా.. ఆ చిన్నారి పెట్టుకోనంటూ మారాం చేసింది. మాస్కు పెట్టుకోవాలనే నిబంధన తప్పనిసరి కావడంతో సిబ్బంది ఏం చేయలేక చిన్నారితో పాటు తల్లిదండ్రులను విమానం నుంచి దింపేశారు. 

ఈ ఘటనపై చిన్నారి తల్లి ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘మా రెండేళ్ల చిన్నారి మాస్కు పెట్టుకోవడానికి నిరాకరించినందుకు మమ్మల్ని విమానంలో నుంచి దింపేశారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్పందిస్తూ.. ఘటనపై విచారణ చేపట్టామని... ఆ కుటుంబాన్ని సంప్రదించి వారికి నగదు రీఫండ్‌ చేస్తామని తెలిపింది. కాగా కంపెనీ ఆగస్టులో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఐదేళ్లు ఆ లోపు ఉన్న చిన్నారులు మాస్కు ధరించడం తప్పనిసరి కాదని సంస్థ పేర్కొనడం గమనార్హం. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని