అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్‌ 

తాజా వార్తలు

Published : 26/08/2020 16:37 IST

అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్‌ 

అమరావతి: వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజుపాలెం మండలం కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ జరిగిందని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది నాగరఘు పిటిషన్‌ దాఖలు చేశారు. రాజుపాలెం వైకాపా కార్యకర్తల తరఫున ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ విచారణ అర్హతపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. అక్రమ మైనింగ్‌ జరుగుతున్నందునే పిటిషన్‌ వేశామని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 

రాజకీయ దురుద్దేశంతో దీన్ని దాఖలు చేశారని.. పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వైట్‌ లైమ్‌ స్టోన్‌, మొజాయిక్‌ చిప్స్‌ అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని.. దీంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్‌ కోరారు. వైకాపా కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. న్యాయస్థానానికి పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని న్యాయవాది నాగరఘు చెప్పారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని