చరిత్రలో రెండుసార్లు మాత్రమే 70 అడుగులు దాటి..
close

తాజా వార్తలు

Updated : 17/08/2020 17:42 IST

చరిత్రలో రెండుసార్లు మాత్రమే 70 అడుగులు దాటి..


భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ఇక్కడ గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 60 అడుగులకు నీటిమట్టం చేరింది. ఏడేళ్ల అనంతరం ఈ స్థాయిలోకి నీటిమట్టం చేరడం ఇదే తొలిసారి. 2013 ఆగస్టు 3న ఇక్కడ నీటిమట్టం 61.6కి చేరింది. 

రాత్రికి 63 అడుగులకు..

భారీగా వస్తోన్న వరదతో భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగి ఇవాళ రాత్రి 9 గంటలకు 63 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా నీటిమట్టం పెరుగుతుందని అటు సీడబ్ల్యూసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. 63 అడుగులకు నీటిమట్టం చేరితే చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.

రెండుసార్లు మాత్రమే..

గోదావరి చరిత్రలో రెండు సార్లు మాత్రమే నీటిమట్టం 70 అడుగులు దాటింది. మరో 4 సార్లు 60 అడుగులు దాటి ప్రవహించింది. 1976, 1983, 2006, 2013లో నీటిమట్టం 60 అడుగులు దాటిందని అధికారులు తెలిపారు. 1986లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ ఏడాది ఆగస్టు 16న నీటిమట్టం 75.66 అడుగులుగా నమోదైంది. 1990 ఆగస్టు 24న మరోసారి 70 అడుగులు దాటి 70.8 అడుగులకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని