మైలార్‌దేవ్‌పల్లిలో 4 మృతదేహాలు లభ్యం

తాజా వార్తలు

Published : 16/10/2020 09:43 IST

మైలార్‌దేవ్‌పల్లిలో 4 మృతదేహాలు లభ్యం

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని అలీనగర్‌లో బుధవారం సాయంత్రం వరదనీటిలో గల్లంతైన 8 మందిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. అబ్దుల్‌ తాహిర్‌ కుటుంబానికి చెందిన 8 మంది ఇంటి అరుగుపై కూర్చున్న సమయంలో ఒక్కసారిగా వరద నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. గురువారం రాత్రి రెండు మృతదేహాలను ఫలక్‌నుమా సమీపంలోని నాలాలో గుర్తించగా... మరో రెండు మృతదేహాలను ఇవాళ గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. మరో నాలుగు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల గల్లంతైనవారిని గుర్తించడం కష్టంగా మారింది. 

ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌ పాతబస్తీ, అసిమాబాద్‌, అల్‌జుబైల్‌ కాలనీ మొత్తం జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దాదాపు 250 కుటుంబాలను రెస్క్యూ బృందాలు పడవల సాయంతో బయటకు తరలించారు. మరికొన్ని కుటుంబాలు ఇళ్లలోనే ఉన్నాయి. వారికి ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్‌జుబైల్‌ కాలనీలో రెండు మృతదేహాలు నీటిలో కొట్టుకొచ్చాయి. నీటి ఉద్ధృతికి ఓ ఇంటిగోడ కూలి వ్యక్తి మృతి చెందాడు. మరోవ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అసిమాబాద్‌ ప్రాంతంలో దాదాపు 100 గేదె కళేబరాలు బయటపడ్డాయి. వాటిని జేసీబీ సహాయంతో బయటకు తీసి లారీలలో తరలించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని