ఈ ఫొటో ఎవరిదో తెలుసా?

తాజా వార్తలు

Published : 01/12/2020 23:07 IST

ఈ ఫొటో ఎవరిదో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్: మూతి ముడుచుకుని ఉన్న ఓ చిన్నారి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఉన్నది ఇప్పటి కేంద్ర మంత్రి అని తెలియటంతో.. అది ఎవరబ్బా అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఈ బుజ్జిపాప ఎవరంటే..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. కాగా ఆమె ఈ సారి ‘‘నాడు-నేడు’’ అంటూ షేర్‌ చేసిన ఓ పోస్టు నెటిజన్లను భలే ఆకట్టుకుంటోంది. తన చిన్నప్పటి ఫొటోలో ఉన్న ముఖకవళికను అనుసరిస్తూ అదే విధంగా ఉన్న తాజా చిత్రంతో కలిపి షేర్‌ చేశారు. అందుకే సాధారణంగా ఎప్పుడూ సరదాగా ఉండే ఈ అమేథీ ఎంపీ.. దీనిలో ముఖం ముడుచుకున్నట్టు కనిపిస్తారు. కాగా, ఈ పోస్టుకు రెండు గంటల్లో 33 వేలకు పైగా లైక్స్‌ రావటం గమనార్హం.

గతంలో కరోనా వైరస్‌ సోకినప్పుడు కూడా ఇరానీ దానిని చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. తన శరీరాన్ని ఉద్దేశించి ‘‘నా శరీరం అనారోగ్యానికి గురవటం నాకిష్టం ఉండదు. ఇప్పటికే కూరగాయలను ఇచ్చాను కదా.. ఇలా చేయటానికి  ఎంత ధైర్యం?’’ అంటూ పోస్టు చేసి అభిమానులను నవ్వించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని