బాలుడి వేగానికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా

తాజా వార్తలు

Updated : 13/12/2020 20:44 IST

బాలుడి వేగానికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా

ముంబయి: పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఆసక్తికర పోస్టులు చేస్తూ ఉంటారు. దేశ విదేశాల్లోని ప్రతిభావంతులకు సంబంధించిన వీడియోలు షేర్‌ చేస్తూ వారిని ప్రశంసిస్తుంటారు. ఆదివారం సైతం అదే తరహా వీడియోను పంచుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. విదేశాలకు చెందిన ఓ బుడతడి వీడియోను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేస్తూ అతడి వేగాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ బాలుడిని యంత్రంతో పోల్చారు. మన దేశానికి కూడా ఇలాంటి వ్యక్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అతడు మెషీన్‌లా ఉన్నాడు. బాలుడు పరుగెడుతున్నప్పుడు అతని కాళ్లు కనిపించనంత వేగంగా కదులుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా తయారవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1.2 బిలియన్లు మంది ఉన్న మన దేశంలో ఈ తరహా ప్రతిభావంతులు లేరా? కచ్చితంగా ఉంటారు. వారిని వెలికితీయాలి. మీ సెల్‌ఫోన్లను సిద్ధం చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి...

టబ్‌లో పులి.. ఏంచేసిందంటే?

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని