గోదావరికి పోటెత్తుతున్న వరద
close

తాజా వార్తలు

Published : 21/08/2020 10:46 IST

గోదావరికి పోటెత్తుతున్న వరద

భద్రాచలం: కాస్త శాంతించినట్లు కనిపించిన గోదారమ్మ మళ్లీ పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. గురువారం రాత్రి 11గంటల సమయానికి 52.9అడుగులుగా ఉన్న నీటి మట్టం.. శుక్రవారం ఉదయానికి 54 అడుగులకు పైనే పెరిగింది. వరద ప్రభావంతో భద్రాచలం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వదర ప్రవాహంతో గత వారం రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  

ధవళేశ్వరం వద్ద..
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 15.60 అడుగులకు చేరింది. 15.98లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండు రోజులపాటు తెరిపిచ్చిన వర్షం మళ్లీ పడుతుండటం, ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరికి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని