నిండుకుండలా సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు

తాజా వార్తలు

Updated : 12/09/2020 11:52 IST

నిండుకుండలా సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్‌ 12 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు 2,18,621 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,  ప్రస్తుతం 589.40 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాగర్‌ పూర్తినీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

పులిచింతల 9 గేట్లు ఎత్తి దిగువకు విడుదల..
ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా పులిచింతల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం పులిచింతలకు 2.33లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో తొమ్మిది గేట్లను మూడు మీటర్ల మేర ఎత్తి 2.18లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 15 వేల క్యూసెక్కుల వరద నీటిని విద్యుదుత్పత్తి కోసం మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 174.57 అడుగులకు నీరు చేరింది. పులిచింతల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 45.10 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని