నివర్‌ ఎఫెక్ట్‌: చిత్తూరు జిల్లా అతలాకుతలం

తాజా వార్తలు

Updated : 27/11/2020 13:50 IST

నివర్‌ ఎఫెక్ట్‌: చిత్తూరు జిల్లా అతలాకుతలం

చిత్తూరు: నివర్‌ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పడమటి మండలాల్లోని వరి పంట నేలకొరిగింది. సుమారు 25వేల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. 

కొన్ని చోట్ల చెట్లు విరిగి వాహనాలపై పడ్డాయి. పుంగనూరు-తిరుపతి మార్గంలో గార్గేయ నది వంతెన కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిమ్మనపల్లి మండలంలో బహుదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పూతలపట్టు మండలం పాలకూరు గ్రామానికి చెందిన వినయ్‌ రెడ్డి గురువారం రాత్రి కాణిపాకం నుంచి ఐరాలకు కారులో వెళ్తుండగా వాగులో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రెస్క్యూ సిబ్బందితో కలిసి వినయ్‌ రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మృతదేహాన్ని వాగులో గుర్తించి వెలికితీశారు. రేణిగుంట మండలం రాళ్లవాగులో గురువారం కొట్టుకుపోయిన రైతు ప్రసాద్‌ మృతదేహాన్ని సిబ్బంది శుక్రవారం వెలికితీశారు. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని