తిరుమలలో వర్ష బీభత్సం

తాజా వార్తలు

Updated : 26/11/2020 13:24 IST

తిరుమలలో వర్ష బీభత్సం

తిరుమల: నివర్‌ తుపాను ప్రభావానికి తిరుమలలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం మొదలైన వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. తిరుమలకు వస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు దారికి అడ్డంగా పడిన చెట్లను తొలగించి స్తంభించిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. తుపాను కారణంగా తిరుపతికి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు ప్రయాణికులకు విమానయాన సంస్థలు సందేశాలు పంపాయి. తుపాను దృష్ట్యా చిత్తూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రాంతాల్లో్ ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో పుల్లూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పుల్లురు క్రాస్‌ నుంచి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో కపిలతీర్థం జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

భారీ వర్షాలతో తిరుపతిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. కపిలతీర్థంలో కాలువను ఆనుకొని ఉన్న పలుకాలనీల్లోకి వరద నీరు చేరింది. తిరుపతి అర్బన్  శ్రీనివాసం 11కెవీ ఉపకేంద్రం పరిధిలో రాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. కమలాపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి నీరు చేరిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రేణిగుంట- కడప జాతీయ రహదారిలో కడప జిల్లా సరిహద్దులో రోడ్లు దెబ్బతిన్నాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని