మరో 3 రోజులు భారీ వర్షాలు

తాజా వార్తలు

Published : 20/10/2020 15:16 IST

మరో 3 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశ అనంతరం ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షం, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని