హేమంత్‌ హత్య.. 21కి చేరిన నిందితులు!

తాజా వార్తలు

Published : 28/09/2020 17:52 IST

హేమంత్‌ హత్య.. 21కి చేరిన నిందితులు!

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన హేమంత్‌ పరువు హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు మరో ముగ్గురిని విచారిస్తున్నారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే 14 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తాజాగా కృష్ణ, బాషా, జగన్‌, సయ్యద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు హేమంత్‌ భార్య అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి, సందీప్‌తోపాటు మరో వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు కృష్ణ.. అవంతి మేనమామ యుగంధర్‌రెడ్డితో కలిసి హేమంత్‌ హత్యకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం నిందితులకు జగన్‌, సయ్యద్‌ సహకరించినట్లు విచారణలో తేలింది.  

గొంతుకు తాడు బిగించడం వల్లే హేమంత్‌ మరణించినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించినట్లు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. సంఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు హేమంత్‌ మొబైల్‌ ఫోన్‌ లభ్యం కాలేదు. పోలీసులు దానిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఇవీ చదవండి..

పరువు కోసం కిరాయి హత్య

హేమంత్‌ హత్య కేసులో మలుపు!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని