హైదరాబాద్‌ విమానాశ్రయంలో స్మార్ట్‌ ట్రాలీలు

తాజా వార్తలు

Published : 27/11/2020 19:23 IST

హైదరాబాద్‌ విమానాశ్రయంలో స్మార్ట్‌ ట్రాలీలు

దేశంలోనే మొదటిసారిగా ప్రారంభం

హైదరాబాద్‌: విమానాల్లో తరచుగా ప్రయాణించే వారికి విమానాశ్రయాల్లో ఓ సమస్య ఎదురవుతూ ఉంటుంది. అదే లగేజీ మోసే ట్రాలీల కొరత. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాల సహాయాన్ని తీసుకుంది. జీఎమ్మార్‌ సంస్థ నిర్వహిస్తున్న ఈ విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ఆధారంగా ట్రాలీలను సమన్వయం చేయనున్నారు. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని శుక్రవారం ప్రారంభించారు. జీఎమ్మార్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్‌ఐఏఎల్‌) దేశంలో మొదటిగా ఐవోటీ ద్వారా ట్రాలీలను ట్రాక్‌ చేయనున్న విమానాశ్రయంగా నిలిచింది. మొదటి వి3000 ట్రాలీలను ఐవోటీ టెక్నాలజీతో అనుసంధానం చేశారు. దీనిద్వారా ప్రయాణికులకు ట్రాలీల లభ్యత మెరుగవుతుంది. ప్రయాణం మొదలు పెట్టే సమయంలో, లగేజీ బెల్ట్‌ల వద్ద ప్రయాణీకులు ట్రాలీల కోసం ఎదురు చూసే సమయం తగ్గుతుందని జీహెచ్‌ఐఏఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఐవోటీతో అనుసంధానమైన ఈ ట్రాలీలను మొబైల్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ దేనితోనైనా వాటిని ట్రాక్‌ చెయ్యొచ్చని వారు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని