నివర్‌ ఎఫెక్ట్‌: ట్రిపుల్‌ ఐటీ పరీక్ష వాయిదా

తాజా వార్తలు

Published : 28/11/2020 00:53 IST

నివర్‌ ఎఫెక్ట్‌: ట్రిపుల్‌ ఐటీ పరీక్ష వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నివర్‌ తుపాను ప్రభావం పరీక్షలపై పడింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు అనుకూల వాతావరణం లేకపోవడంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ట్రిపుల్‌ ఐటీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్‌జీయూకేటీ కన్వీనర్‌ డి.హరినారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. రేపు జరగాల్సిన పరీక్షను డిసెంబర్‌ 5వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే పరీక్షా కేంద్రాలు, ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రెండు గంటలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని