స్వర్ణప్యాలెస్‌ ఘటనలో వైద్యుల్ని దోషులుగా చూడొద్దు

తాజా వార్తలు

Published : 11/08/2020 23:21 IST

స్వర్ణప్యాలెస్‌ ఘటనలో వైద్యుల్ని దోషులుగా చూడొద్దు

డీజీపీకి ఐఎంఏ రాష్ట్ర శాఖ లేఖ

అమరావతి: విజయవాడ కొవిడ్‌ చికిత్సా కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన వైద్యులను దోషులుగా చూడొద్దని ఐఎంఏ రాష్ట్రశాఖ డీజీపీని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు నడిపేందుకు అనుమతిచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్రశాఖ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఈ మెయిల్‌లో లేఖ పంపింది. స్వర్ణప్యాలెస్‌ చాలా కాలం నుంచి స్టార్‌ హోటల్‌గా ఉందని... అన్ని అనుమతులూ ఉండే ఉంటాయని భావిస్తున్నామని పేర్కొన్నారు. పరిశీలించకుండానే వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు ఇచ్చి ఉంటుందని తాము భావించడంలేదన్నారు. రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని ఈ ఘటనకు బాధ్యులుగా చేయడం తగదన్నారు. ముఖ్యంగా వైద్యుల విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించాలని సూచించారు. వైద్యులపై తదుపరి చర్యలు తీసుకోకుండా సంయమనం వహించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని