ఆహారం, నీటి కాలుష్యం వల్లే వింత వ్యాధి!

తాజా వార్తలు

Published : 09/12/2020 12:27 IST

ఆహారం, నీటి కాలుష్యం వల్లే వింత వ్యాధి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏలూరు ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై జాతీయ పరిశోధన సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ ఎన్‌ఐఎస్‌ శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరించారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లోనూ కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతోపాటు పలు నమూనాలు తీసుకున్నారు. ఆహారం, నీటి కాలుష్యం వల్లే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త జేజే బాబు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరిశోధనలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దానిపై ఆధారాలు సేకరించి శుక్రవారం నాటికి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

ఏలూరు పరిసర ప్రాంతాల నీటిలో రసాయనాలు

ఏలూరు బాధితులు స్టేట్‌మెంట్ నమోదు
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని