డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి హరివంశ్‌ నామినేషన్‌

తాజా వార్తలు

Published : 09/09/2020 22:21 IST

డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి హరివంశ్‌ నామినేషన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవి కోసం జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) ఎంపీ హరివంశ్‌ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. థావర్‌చంద్‌ గహ్లోత్, నరేష్‌ గుజ్రాల్‌ వంటి నేతల సమక్షంలో ఆయన నామినేషన్‌ వేశారు. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల ఏడో తేదీన ప్రారంభమైన నామినేషన్‌ ప్రక్రియ 11వ తేదీ వరకు జరగనుంది. 
2018లో కాంగ్రెస్‌ నేత బీకే హరిప్రసాద్‌ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో పదవీకాలం ముగయనుండటంతో మరోసారి పోటీలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెరాస, జేడీయూ వంటి పార్టీల అండతో 140 మంది ఎంపీల మద్దతు తమకు లభిస్తుందని, హరివంశ్‌ తిరిగి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నారని భాజపా ధీమాతో ఉంది. 245మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయేకు 113 మంది సభ్యుల బలం ఉంది. హరివంశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు భాజపా యత్నిస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని