రాయలసీమ ఎత్తిపోతలపై తీర్పు రిజర్వు

తాజా వార్తలు

Published : 11/08/2020 13:55 IST

రాయలసీమ ఎత్తిపోతలపై తీర్పు రిజర్వు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో వాదనలు ముగిశాయి. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్త భాగాలను చేర్చారని ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
‘‘40వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు మార్చారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించేలా పథకాన్ని మార్చారు. ఏపీ ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చింది’’ అని పిటిషనర్‌ ఆరోపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటరమణి స్పందిస్తూ... రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని వివరించారు. తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని తెలిపారు. కమిటీ నివేదిక కూడా ఏపీకి అనుకూలంగా ఉన్నందున కేసును ముగించాలని కోరారు. 

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని వివరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఖరేంటో వారం రోజల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని