తెలుగుతల్లికి గర్భశోకం:జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తాజా వార్తలు

Published : 26/09/2020 01:19 IST

తెలుగుతల్లికి గర్భశోకం:జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఎస్పీ బాలు మృతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంతాపం

దిల్లీ: తన అమృతగానంతో తెలుగు భాష, సాహిత్య చరిత్రలను సజీవంగా ఉంచడమే కాకుండా ప్రజ్వరిల్లింపజేసిన మహనీయుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. ఆయన మరణం తెలుగు భాషకు, జాతికి తీరని లోటని చెప్పారు. సుస్వర మాధుర్యంతో యావత్‌ ప్రపంచాన్ని ఆనందసాగరంలో ఓలలాడించిన గొప్ప మనిషి ఎస్పీ బాలు అని ఆయన కొనియాడారు. 

‘‘తన అమరగానంతో తెలుగుభాషలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టి యావత్‌ సంగీత సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా ఏలిన జైత్రయాత్రికుడు ఆయన. తెలుగుజాతి ఉన్నంతవరకు అందరి హృదయాల్లో బాలు ఉంటారు. ఆయన మరణం తెలుగుతల్లికి గర్భశోకం. తెలుగువారంతా బాలు కుటుంబసభ్యులే. అందుకే ఆయన్ను కోల్పోయి కుమిలిపోతున్న వారి కుటుంబసభ్యులతోపాటు యావత్‌ సంగీత అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని