జనవరి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

తాజా వార్తలు

Updated : 19/12/2020 23:59 IST

జనవరి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

బెంగళూరు: 2021 జనవరి 1వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులతో పాటు, ఇంటర్మీడియట్‌, డిగ్రీ విద్యార్థులకు తరగతులు  ప్రారంభిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు ‘విద్యగమ’ కార్యక్రమంలో భాగంగా వారి ఇళ్ల వద్దే చదువుకొనే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారికి పాఠశాల పరిసరాల్లో ఆరు బయట తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ‘‘ పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఒకటి విద్యార్థుల ఆరోగ్యం, రెండోది వారి భవిష్యత్తు. అన్ని సంరక్షణ చర్యలు తీసుకొనే పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. తరగతి గదుల్లో 15 మంది విద్యార్థులనే అనుమతిస్తాం. వారు ఖచ్చితంగా పాఠశాలలకు రావాలని లేదు. ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు విన్నా సరిపోతుంది.’’ అని కర్ణాటక విద్యాశాఖ మంత్రి తెలిపారు.

పరీక్షలు తదితర అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘పది, ఇంటర్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వారికి తరగతులు నిర్వహించాలని సాంకేతిక సలహా మండలి సూచించింది. విద్యార్థులు వారంలో రెండు, మూడురోజులు తరగతులకు హాజరైనా సరిపోతుంది.’’ అని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప ట్విటర్‌లో ప్రకటించారు. కరోనా కారణంగా మార్చి నుంచి పాఠశాలలు తెరుచుకోలేదు. డిసెంబరు నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రతిపాదనలు వచ్చినా నిపుణుల సూచన మేరకు అది అమలు కాలేదు. కాగా కర్ణాటకలో ఇప్పటి వరకు 9,07,123 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి..

పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధమే: రాహుల్Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని