పోలవరంపై హైదరాబాద్‌లో కీలక భేటీ

తాజా వార్తలు

Updated : 02/11/2020 11:29 IST

పోలవరంపై హైదరాబాద్‌లో కీలక భేటీ

హైదరాబాద్‌: పోలవరానికి కేంద్ర నిధుల సాధనే ప్రధాన అజెండాగా హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన కేంద్ర జలసంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి రంగారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అదిత్యనాథ్‌దాస్‌, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా ధరల ప్రకారం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలు, ఇవే అంశాలను అథారిటీ సమావేశంలోనూ ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ షరతులు పెడుతున్న సమయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కొర్రీని యథాతథంగా ఆమోదించి పంపుతారా? చర్చల తర్వాత అప్పటి అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మించడం కష్టమని తేలుస్తారా? అన్నది చూడాలి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌నుంచి హాజరవుతున్న అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యారు. నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేయనున్నారు. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ మార్గదర్శకాలు, దేశంలోని ఇలాంటి 16 ప్రాజెక్టులకు ఇంతవరకు ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? తదితర అంశాలను ప్రస్తావించేలా సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు? పోలవరం అథారిటీ ఏ ఉద్దేశంతో ఏర్పడింది? 2013 భూసేకరణకు కేంద్రం చేసిన చట్టం పోలవరంపై ఎలాంటి ప్రభావం చూపింది? ఈ దశలో చాలినంత నిధులివ్వకపోతే భవిష్యత్తేమిటి? తదితర అంశాలతో వాదనను వినిపించేందుకు ఏపీ సిద్ధమవుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని