పాల్‌, మీకు నోబెల్‌ బహుమతి వచ్చింది..

తాజా వార్తలు

Updated : 13/10/2020 18:49 IST

పాల్‌, మీకు నోబెల్‌ బహుమతి వచ్చింది..

ఇంటర్నెట్‌ డెస్క్: అర్థశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతిని ఈ సంవత్సరానికి గాను అమెరికా ఆర్థిక వేత్తలు పాల్‌ మిల్‌గ్రామ్‌, రాబర్ట్‌ బి విల్సన్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే మిల్‌గ్రామ్‌కు ఆ వార్తను స్వయంగా తెలియచేసేందుకు నోబెల్‌ ప్రైజ్‌ కమిటీ ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. దీనితో పొరుగునే ఉన్న మరో నోబెల్‌ గ్రహీత రాబర్ట్‌ విల్సన్‌ను తెలపాల్సిందిగా కమిటీ కోరింది. కాగా, 84 ఏళ్ల రాబర్ట్‌ విల్సన్‌ రాత్రి 2:15 గంటల సమయంలో .. 72 ఏళ్ల పాల్‌ మిల్‌గ్రామ్‌ ఇంటి తలుపు తట్టి మరీ ఈ శుభవార్తను తెలియ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియోను స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.

స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు అయిన వీరిద్దరూ ఒకే వీధిలో ఇరుగు పొరుగున నివసిస్తారు. కాగా మిల్‌గ్రామ్‌ తలుపు కొట్టిన బాబ్ ‘‘పాల్‌, మీకు నోబెల్‌ బహుమతి వచ్చింది..’’ అని సెక్యూరిటీ కెమేరా ద్వారా తెలియ చేసిన దృశ్యాన్ని నలుపు తెలుపుల్లో కనిపించే ఈ వీడియోలో చూడవచ్చు. ఇందుకు ‘‘అవునా.. నాకొచ్చిందా..వావ్‌!’’ అని మిల్‌గ్రామ్‌ స్పందించడం కూడా దీనిలో వినవస్తుంది. కాగా ఈ వీడియోకు చూసిన సుందర్‌ పిచాయ్‌తో సహా పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని