ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

తాజా వార్తలు

Published : 13/10/2020 20:00 IST

ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

విజయవాడ: గత రాత్రి నుంచి విజయవాడ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఓంకారం మలుపు వద్ద రాళ్లు రోడ్డుపై పడ్డాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులను ఘాట్‌రోడ్డులోకి అనుమతించలేదు. దీంతో ప్రమాద సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని ఆలయ అధికారులు, సిబ్బంది తెలిపారు. ఘాట్‌రోడ్డుపై కొండచరియల తొలగింపు చర్యలు చేపట్టారు. 

సాధారణంగా వర్షం పడే సమయంలో కొండపై నుంచి చిన్న చిన్న రాళ్లు పడుతుండేవని.. అయితే, ఈ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటం ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. కొండపై నుంచి రాళ్లు కిందకు పడకుండా తీగలు అడ్డుపెట్టారు. అయినప్పటికీ తీగలను సైతం నెట్టుకుని కిందకు వచ్చి రోడ్డుమీదకు పడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల కోసం పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాలనుంచి కొంత మంది సిబ్బంది అక్కడికి వస్తున్నారు. కాగా, నిన్నటి నుంచి వర్షం పడుతుండటంతో ముందస్తు చర్యల్లో చేపట్టడంతో ప్రాణాపాయం తప్పిందని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని