త్వరలో ‘లవ్‌జిహాద్‌’ వ్యతిరేక చట్టం తెస్తాం 

తాజా వార్తలు

Published : 18/11/2020 01:00 IST

త్వరలో ‘లవ్‌జిహాద్‌’ వ్యతిరేక చట్టం తెస్తాం 

* మధ్యప్రదేశ్ హోంమంత్రి

భోపాల్‌: ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో మత మార్పిడులు (లవ్‌ జిహాద్‌) చేసే వారికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలో ఒక చట్టం తీసుకురానున్నట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా మంగళవారం తెలిపారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఐదేళ్లు కఠినకారాగార శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నవారు కూడా శిక్షార్హులవుతారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా స్వచ్ఛంద మత మార్పిడి కోసం నెల రోజులు ముందుగా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని