రేపటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం

తాజా వార్తలు

Published : 15/11/2020 20:01 IST

రేపటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం తెరిచారు. సోమవారం ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు (టీడీబీ) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఆలయ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిలక్కల్‌, పంబా బేస్‌ క్యాంప్‌కు చేరుకునే 48 గంటల ముందు చేయించుకున్న పరీక్షలో కరోనా నెగెటివ్‌ రిపోర్టుతో వచ్చిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. 

‘వర్చువల్‌ క్యూ’ పద్ధతిలో రిజిస్టర్‌ చేసుకున్న భక్తులను రోజుకు వెయ్యి మంది చొప్పున దర్శనభాగ్యం కల్పిస్తారు. శని, ఆదివారాల్లో 2 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవచ్చు. మండల విలక్కు- పూజలో భాగంగా రెండు నెలల పాటు జరిగే పూజా కార్యక్రమాల్లో మొత్తం 85,000 మంది దర్శనం చేసుకునేలా దేవస్థానం బోర్టు ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్లలోపు, 60 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారిని దర్శనానికి అనుమతించరు. ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వందల మంది వైద్యసిబ్బంది ఆలయానికి వెళ్లే మార్గాల్లో భక్తులకు కరోనా టెస్టులు చేయనున్నారు. పంబా నదిలో దిగి స్నానాలు చేయడానికి భక్తులకు అనుమతి లేదని ఆలయ వర్గాలు వివరించాయి. ఈ నేపథ్యంలో భక్తులు స్నానాలు చేసేందుకు అనుకూలంగా ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేశారు. పంబాబేస్‌ క్యాంపుతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తులు బస చేయడానికి వీలు లేదని ట్రావెన్‌కోర్‌ ఆలయబోర్డు తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని