ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

తాజా వార్తలు

Updated : 30/11/2020 13:34 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో బలపడనుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రానికి శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశమున్నట్లు తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో దక్షిణ కోస్త జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని