కరోనాపై ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి

తాజా వార్తలు

Updated : 26/08/2020 17:45 IST

కరోనాపై ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి

ప్రజలు కూడా తమను తాము రక్షించుకోవాలి:బాలకృష్ణ

హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. కరోనాపై పోరులో ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పని చేయాలని.. అదే సమయంలో ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని సూచించారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి సంగారెడ్డిలోని మహేశ్వర వైద్య కళాశాల వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి ఎన్‌-95 మాస్కులను అందజేసింది. ఆసుపత్రి తరపున కళాశాల ఛైర్మన్‌ టీజీఎస్‌ మహేశ్‌ నుంచి బాలకృష్ణ వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొవిడ్‌ మహమ్మారిపై పోరులో మహేశ్వర వైద్య కళాశాల చేస్తున్న సహాయం ఎంతో మేలు కలిగిస్తోందన్నారు. వైద్య సేవలే కాకుండా సామాజికంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుండటం పట్ల కళాశాల ఛైర్మన్‌ టీజీఎస్‌ మహేశ్‌ను బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని..త్వరలోనే వ్యాక్సిన్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు బాలకృష్ణ చెప్పారు. ఇప్పటికే ప్లాస్మా ద్వారా కొంత ఉపసమనం లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా పట్ల భయం వదిలి వైరస్‌ను జయించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కొవిడ్‌ కారణంగా క్యాన్సర్‌ చికిత్స నిలిపివేయలేమన్నారు. ఈ విషయంలో బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషిని బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా ఆసుపత్రి తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చికిత్స కోసం వచ్చే ప్రతి వ్యక్తినీ ముందుగా స్ర్కీనింగ్‌ చేస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు సినిమాల గురించి బాలకృష్ణను ప్రశ్నించగా..షూటింగ్‌లకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. త్వరలోనే దీనిపై పరిశ్రమ పెద్దలంతా కూర్చుని ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని