చంద్రబాబుకు మదనపల్లె డీఎస్పీ నోటీసులు

తాజా వార్తలు

Published : 02/09/2020 01:54 IST

చంద్రబాబుకు మదనపల్లె డీఎస్పీ నోటీసులు

మదనపల్లి (నేర విభాగం): తెదేపా అధినేత చంద్రబాబు సహా మరో ఇద్దరికి మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపారు. వైకాపా నేతల వేధింపుల కారణంగానే ఓంప్రతాప్‌(30) అనే యువకుడు మృతిచెందినట్లు ఇటీవల చంద్రబాబుతో పాటు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేశ్‌, వర్ల రామయ్యకు నోటీసులు పంపినట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. విచారణ భాగంగా ఏమైనా ఆధారాలు ఉంటే వారంలోపు నేరుగా లేదా తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అందజేసి దర్యాప్తునకు సహకరించాలని వారిని కోరినట్లు డీఎస్పీ చెప్పారు. 

చిత్తూరు జిల్లా సోమల మండలంలో గత నెల 24న ఓం ప్రతాప్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆ యువకుడు మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడం.. ఆ తర్వాత మృతిచెందడం పలు ఆరోపణలకు దారి తీసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఓం ప్రతాప్‌ మృతిపై సోమల మండల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణాధికారిగా డీఎస్పీ మనోహరాచారిని నియమించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌, వర్ల రామయ్యకు డీఎస్పీ నోటీసులు పంపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని