షార్ట్‌తో వీడియో కాల్‌ మీటింగ్‌కు..!

తాజా వార్తలు

Published : 09/09/2020 01:10 IST

షార్ట్‌తో వీడియో కాల్‌ మీటింగ్‌కు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ వచ్చి ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ అనే మాటను ప్రస్తుతం చాలా మందికి పరిచయం చేసింది. ఎందుకంటే వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రొం హోం అవకాశాన్ని కల్పించాయి. అందులో భాగంగా ముఖ్యమైన సమావేశాలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇంటి నుంచే పని అంటే తెలియనిది ఏముంది. ఇంటి నుంచే పని కాబట్టి వేషధారణ ఎలా ఉన్నా ఏం కాదులే అని భావించి అందరూ సాధారణంగా తయారవుతారు. ఈ క్రమంలో ఓ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన వీడియో కాల్‌ మీటింగ్‌ తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు సాధారణంగా సూట్‌ వేసుకుని వీడియో కాల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సమావేశానికి హాజరవుతారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కుమారుడు మధ్యలో దూరి సమావేశానికి ఆటంకం కలిగిస్తాడు. దీంతో ఆ పిల్లాడ్ని బయటకు పంపడానికి ఆ వ్యక్తి లేవడంతో అతడు షార్ట్‌ ధరించి ఉండటం చూసి మిగతా ఇద్దరూ నైస్‌ షార్ట్‌ అంటూ నవ్వుతారు. ఇంతలో మరో వ్యక్తి ఇంట్లోనూ శబ్దం కావడంతో అతడూ పైకి లేస్తాడు. అక్కడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది. ఇలా వారు షార్ట్‌లు వేసుకుని వీడియో కాల్‌ సమావేశానికి హాజరు కావడం ఎంతో హాస్యాస్పదంగా ఉండటంతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ‘నైస్‌ షార్ట్స్‌’ అంటూ కొందరు, ‘పిల్లాడి డ్యాన్స్‌ బాగుంది’ అంటూ మరికొందరు చమత్కారంగా కామెంట్లు చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని