కూర్చున్న చెట్టునే నరికాడు..వైరల్ వీడియో

తాజా వార్తలు

Updated : 29/09/2020 19:14 IST

కూర్చున్న చెట్టునే నరికాడు..వైరల్ వీడియో

దిల్లీ: ఎవరైనా తనకు తాను అపాయం కలిగించుకునే మూర్ఖమైన పని చేస్తున్నప్పుడు ‘తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు’ అనే సామెతను వాడతాం. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ వీడియో కూడా ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. కాకపోతే ఇందులో వ్యక్తి మాత్రం తాను కింద పడకుండా చెట్టు పైభాగాన్ని నరికిన విధానం ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తోంది. అమెరికన్ మాజీ ఫుట్‌బాలర్ రెక్స్‌ చాప్‌మన్ ఈ వీడియో షేర్ చేసి, ‘పొడవైన తాటిచెట్టును కత్తిరించడాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చూశారా?’ అంటూ వ్యాఖ్యను జోడించారు. 
అందులో ఓ వ్యక్తి  చాలా ఎత్తుగా ఉన్న తాటి చెట్టు ఎక్కి, పైభాగాన్ని కోసివేస్తుండటం కనిపిస్తుంది. అతడు దానికొస వరకు ఎక్కడంతో ఆ చెట్టు ఒక పక్కకు ఒరిగిపోయింది. తరవాత దాన్ని రంపంతో  కోసేశాడు. ఆకులు ఉన్నంత వరకు తెగిపడిపోవడంతో, కాండం భాగం వేగంగా వెనక్కి, ముందుకు ఊగడం చూస్తే, అతడు కిందపడతాడేమోనని భయమే కలుగుతుంది. కానీ, అతడు మాత్రం నిక్షేపంగా దానిపైనే కూర్చున్నాడు. కాగా, అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈ వీడియోకు నెట్టింట్లో భారీగా లైక్స్‌ వచ్చాయి. 

‘ఎవరైనా ఆ వ్యక్తి చెట్టుపై నుంచి ఎగిరిపడతాడనుకుంటే చేతులు పైకెత్తండి’, ‘ఆయన ఒక్కడే కాదు..చేతిలో రంపం కూడా ఉంది’ అంటూ కామెంట్లు చేశారు. చెట్టు మొదలు నుంచి నరకొచ్చు కదా అని కొందరు అడగ్గా..అంత పొడవైన చెట్టు మొత్తం ఒకేసారి కింద పడితే కరెంటు తీగలు, భవనాలు దెబ్బతింటాయని మరికొందరు వివరణ ఇచ్చారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని