భూమిపై నూకలు మిగిలుండటమంటే ఇదేనేమో!

తాజా వార్తలు

Updated : 25/08/2020 19:51 IST

భూమిపై నూకలు మిగిలుండటమంటే ఇదేనేమో!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని ప్రమాదాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రెప్పపాటులో ఊహించనంత నష్టం జరిగిపోతుంది. మరోవైపు వెంట్రుక వాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నవారూ లేకపోలేదు. అలాంటి వారికి ఇంకా భూమిపై నూకలు మిగిలున్నాయని పెద్దలు చెబుతుంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే కేరళలోని కొల్లాం జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకొని బతుకుజీవుడా అని బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నిసార్‌ అనే వ్యక్తి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగా ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది.అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం గమనార్హం.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని